సరిహద్దుల్లో సైనికుడు..అతని భార్యతో స్నేహితుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్యాకుమారి జిల్లా మార్తాండంలో దారుణం జరిగింది..దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న సైనికుడి భార్యతో అతడి స్నేహితుడు అక్రమ సంబంధం పెట్టుకొని స్నేహం అనే మాటకి మాయని మచ్చ తెచ్చాడు..వివరాల్లోకి వెళితే… కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేష్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైకులను విక్రయించే షోరూమ్‌ను నడుపుతున్నాడు. అయితే, ఇదే జిల్లాలోని పంచమూర్తి అనే ప్రాంతానికి చెందిన సైనికుడు ఒకరు రమేష్ షోరూమ్‌లో ఓ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. దీంతో ఆ సైనికుడికి, రమేష్‌కు మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో రమేష్‌ తరచూ సైనికుడి ఇంటికి వచ్చే వెళ్లే సమయంలో సైనికుడి భార్యతో రమేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. సైనికుడు లేని సమయంలో రమేష్‌ అతని భార్యతో సన్నిహితంగా గడుపూత వచ్చాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా రమేష్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోలను రమేష్‌ భార్య చూసి దిగ్భ్రాంతి గురై.. తన భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని, ఆ వీడియోలను సామాజిక మాద్యమంలో అప్‌లోడ్ చేసింది. ఆ తర్వాత ఆ వీడియోలను చూసిన సైనికుడు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రమేష్‌ ను విచారిస్తున్నారు. అయితే సైనికుడి భార్య పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయకపోవడంతో రమేశ్‌ను మందలించి వదిలివేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: