ఎంజాయ్ చేద్దామన్నాడు…ఆశపడి వచ్చి…ఇంటికి నిప్పంటించి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎంజాయ్ చేద్దామని ప్రియురాలిని ఇంటికి ఆహ్వానించిన ఆ యువకుడు తలుపులు తీయకుండా నిద్రపోయాడు. దీంతో సహనం కోల్పోయిన సదరు యువతి పెట్రోల్ తీసుకొచ్చి ఆ యువకుడి ఇంటిపై పోసి నిప్పంటించింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. న్యూజెర్సీలోని వుడ్ బరీలో తైజా రస్సెల్(29) అనే యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారింది. ఈ క్రమంలో ఎంజాయ్ చేసేందుకు తన ఇంటికి రావాలని రస్సెల్ ను ఆ యువకుడు ఆహ్వానించాడు. దీనికి ఆ యువతి ఎంతో ఆశగా అతని ఇంటికి వచ్చింది.

కానీ, ఆ యువకుడు మాత్రం అప్పటికే ఫుల్ గా మద్యం సేవించి నిద్రలోకి జారుకున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన రస్సెల్ 8 సార్లు ఫోన్ చేసింది. రెండు సార్లు సందేశాలు పంపింది. అయినా యువకుడు నిద్రలేవలేదు. దీంతో సహనం కోల్పోయిన రస్సెల్ దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లి, ఓ బాటిల్ నిండా పెట్రోల్‌తో పాటు లైటర్‌ను కొనుగోలు చేసింది. నేరుగా యువకుడి ఇంటికి వచ్చి ఇంటిపై చల్లి నిప్పు పెట్టి అక్కడ నుంచి పారిపోయింది. అయితే మంటల వేడికి ఉదయం 4.30 గంటల సమయంలో మేలుకున్న యువకుడు కిటికీని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో అతనికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో యువకుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోని శునకాన్ని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి రస్సెల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: