తండ్రి కామదాహం..తల్లి సహకారం..చితికిపోయిన చిన్నారులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని లక్నోలో సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఘోరాతి ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది..కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ కూతుళ్ళ పాలిట కామాంధుడయ్యాడు…కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్న తల్లే ఆ పిల్లల పాలిట కసాయి గా మారింది…వివరాల్లోకి వెళ్తే…లక్నోకు చెందిన ఓ యువతి(21) తనపై తండ్రి 15 సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు(6) పై కూడా తండ్రి ప్రస్తుతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు ఓ ఎన్జీఓ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో తన సోదరిని ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చింది. ఇంట్లో జరుగుతుందంతా తల్లికి తెలిసినప్పటికీ నోరు మెదపకపోవడంతో పాటు తండ్రికి సహకరిస్తూ తనకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేదని పోలీసుల ఎదుట వాపోయింది. దీంతో లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం బాధితురాలి తల్లిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: