పచ్చని కాపురంలో “లడ్డూల” చిచ్చు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తన భార్య ఇంట్లో భోజనానికి బదులుగా లడ్డూలు పెట్టి వేధిస్తోందనీ, వెంటనే తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించిన విచిత్రమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే… ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన ఓ జంటకు పదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే కొంత కాలంగా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతడి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయిన భార్య.. ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది. తన భర్త ఆరోగ్యం బాగుచేయాలని మాంత్రికుడి వద్ద మొరపెట్టుకుంది. ఆమెకు అభయహస్తమిచ్చిన మాంత్రికుడు.. ప్రతిరోజూ, రెండుపూటలా భర్తకు లడ్డూలు తినిపిస్తే అతడు తిరిగి ఆరోగ్యవంతుడవుతాడని సెలవిచ్చాడు.

అంతే.. ఆ మాంత్రికుడి బోధను ఆమె ఓ దివ్యోపదేశంగా భావించి, ఆచరణలో పెట్టింది. ప్రతి రోజూ రెండూ లడ్డూలు తినిపించసాగింది. కొద్ది రోజులకు లడ్డూలపై అతనికి విరక్తి పుట్టింది. అయినా భార్య మాత్రం వదిలిపెట్టలేదు. లడ్డూలు తినాల్సిందేనంటూ భార్య పెట్టే బాధలను తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాడు. భార్య మాత్రం ఒక్క మెట్టుకూడా దిగలేదుకదా.. మీ ఆరోగ్యం కోసమే ఇదంతా అంటూ.. మరింత కఠినంగా ప్రవర్తించ సాగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో… నాకు విడాకులింప్పిచండి మహాప్రభో అంటూ ఆ భర్త కోర్టును వేడుకున్నారు. భర్త చెప్పిన కారణం విని మొదట వారు కూడా షాకయ్యారు. అయితే.. ఓ జంట విడిపోవడం చూడలేని వారు, దంపతులని కౌన్సెలింగ్‌కు పిలిపించారు. తర్వాత వారిలో మార్పు రాకుంటె విడాకులు మంజూరు చేస్తామని కోర్టు తెలిపింది.

Share.

Comments are closed.

%d bloggers like this: