‘బికినీ’ ఎయిర్‌లైన్స్.. రూ.9కే విమాన టికెట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విమాన‌రంగంలో కొత్త సంస్థ‌ల ఎంట్రీతో ఆఫ‌ర్లు అదిరిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే వియత్నాంకు చెందిన వియత్‌ జెట్‌ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6 నుంచి భారత్-వియత్నాం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్‌ జెట్‌ మంగళవారం తెలిపింది. తొలి ఫ్లైట్ ఢిల్లీ నుంచి వియత్నాం ప్రయాణించనుంది. ప్రయాణ సమయం 5 గంటలు పట్టొచ్చు. ప్రతి రోజూ విమానాలు నడుపుతామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో మరో బంపర్‌ ఆఫర్‌‌ను కూడా ప్రకటించింది. స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌‌లో భాగంగా ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో ‘సూపర్-సేవింగ్ టిక్కెట్లు’ అందిస్తోందని వియత్‌జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్‌సన్ తెలిపారు. ఇది కేవలం బేస్ ఫేర్ మాత్రమే. అంటే ఇతర పన్నులు అదనం. అన్నీ కలుపుకుంటే టికెట్ కొనుగోలు చేయాలంటే ప్రారంభ ధర రూ.8,863గా ఉంది. డిసెంబర్ 2011లో వియత్‌జెట్ పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అలాగే ప్రతి ఏటా ఈ సంస్థ విడుదల చేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీలు ధరించివుంటారు. అందువల్ల ఈ ఎయిర్‌లైన్స్‌కు బికినీ ఎయిర్‌లైన్స్ అనే పేరుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: