“బ్యాడ్ బాయ్ సాంగ్” ఆల్ టైమ్ రికార్డ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు అన్నీ ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలుగు సినిమా కలలో కూడా ఊహించని విధంగా సాహో క్రేజ్ ఉంది ఇప్పుడు. తాజాగా విడుదలైన బ్యాడ్ బాయ్ సాంగ్ అయితే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ పాటలో జాక్వెలిన్ చాలా హాట్‌గా ఉంది. ప్రభాస్ తో కలిసి స్టెప్పులు అదరగొట్టింది. ఒక్క రోజులో ఓ పాటను అత్యధిక మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్‌ బాయ్‌’ రికార్డులు క్రియేట్ చేసింది. ఇది చూసి చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఈ పాట ఇరవై మిలియన్ల వ్యూస్ ని రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: