“మోడీ,షా” లకు చెప్పిన తర్వాతే జగన్ నిర్ణయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అవినీతిని అడ్డుకునే విషయంలో తమ సంకల్పానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు చెప్పిన తర్వాతే ఈనిర్ణయాలు తీసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఆశీస్సులు తమకు ఉన్నాయన్నారు. రాజధానిని మారుస్తామని ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. కొండవీటి వాగు వల్ల రాజధాని ప్రాంతానికి వరద ముంపుందన్నారు. అయితే ఈ వరదను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. రాజధాని మార్చుతున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ హయంలో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టుగా విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమకు కేంద్రం సహకారం కూడ ఉందని ఆయన తెలియజేసారు.

Share.

Comments are closed.

%d bloggers like this: