Advertisements

మూడో బిడ్డ వద్దన్న భర్త…11 సార్లు పొడిచి చంపిన భార్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుత సమాజంలో ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి గల కారణాలు చూస్తుంటే మతి పోతుంది…దీనికి కూడా చంపుకుంటారా అని అనిపించే కారణాలు వెలుగుచూస్తున్నాయి…తాజాగా ముంబై లో ఇలాంటి విచిత్ర ఘటనే ఒకటి జరిగింది. అయితే అది భార్య,భర్తల విషయంలో జరిగింది. మరో బిడ్డను కనడానికి అంగీకరించడం లేదనే కోపంతో ఓ భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా పొడిచి చంపింది. వివరాలను పరిశీలిస్తే…

ముంబైలోని నలాసొపొరా ప్రాంతానికి చెందిన సునీల్(36) అనే వ్యక్తికి ప్రణాలీ కదమ్ అనే భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పిల్లలిద్దరూ అమ్మాయిలే కావడంతో అతడి భార్య ప్రణాళికి మగబిడ్డను కనాలన్న కోరిక కలిగింది.. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా..అతను అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని.. మరో బిడ్డ అవసరం లేదని వారించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రణాలీ బుధవారం తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో కూరగాయలు కోసే కత్తితో భర్తను 11 సార్లు విచక్షణా రహితంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రణాలీని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో నిందితురాలు పొంతనలేని సమాధానం చెబుతున్నట్లుగా తెలుస్తోంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే చంపానంటూ వాంగ్మూలం ఇచ్చింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు నేరాన్ని అంగీకరించింది. మూడో బిడ్డ వద్దన్న కారణంతోనే ఆమె భర్తను చంపిందని తెలిసి పోలీసులు షాకయ్యారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: