రాజధాని మార్పు…బొత్స స్పందన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపాయి…దాంతో తాము రాజధానిని తరలించబోవడంలేదంటూ వైసీపీ మంత్రులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, బొత్స స్వయంగా మాట్లాడారు. రాజధాని అమరావతిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు. రాజధాని విషయంలో వరదల పరిస్థితి గురించే మాత్రమే తాను మాట్లాడానని దాన్ని ఇష్టం వచ్చినట్లు అనువర్తించుకున్నారంటూ చెప్పుకొచ్చారు. రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే అతలాకుతలమైందని, మొన్న 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వెల్లడించారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టు కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారని బొత్స ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. చెన్నై, ముంబై రాజధానులతో అమరావతికి పోలికేంటని చంద్రబాబును నిలదీశారు. ముంపునకు గురవుతుందని తెలిస్తే అక్కడ రాజధాని కట్టేవారా అని నిలదీశారు. అమరావతి చుట్టూ తెలుగుదేశం పార్టీ నేతల భూములే ఉన్నాయని అందువల్లే వారు భయపడుతూ ఇలాంటి ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే తన అభిమతమన్నారు. రూ.25లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: