ఇకపై అలాంటి సినిమాలు చేయను..ప్రభాస్ సంచలన నిర్ణయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా సాహో. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్, శ్రద్ద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వేడుకలో పాల్గొన్న హీరో ప్రభాస్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇకపై భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించబోనని తెలిపాడు. భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా చాలా రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తుందనీ, అంతేకాకుండా సినిమా విడుదల సమయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించాడు. అభిమానుల కోరిక మేరకు ఇకపై ఏటా రెండు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రభాస్ వెల్లడించాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: