Advertisements

శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం…భార్య, పిల్లలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైంది. ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీశాంత్ ముంబై వెళ్లగా ఆయన భార్య పిల్లలు, పనివారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు కనిపించడంతో పొరుగువారు వెంటనే అగ్నిమాపక అధికారులకు ఫోన్ చేయగా అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది గ్లాస్ వెంటిలేటర్ పగులగొట్టి ఇంట్లోని వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తన భార్య, పిల్లలు మొదటి అంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని డ్రాయింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయని శ్రీశాంత్ తెలిపారు. సీలింగ్ ఫ్యానులో షార్ట్ సర్కూట్ ఏర్పడిన కారణంగానే మంటలు ఏర్పడినట్లు భావిస్తున్నారు. కాగా, ఇటీవలే క్రికెట‌ర్ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధ కాలాన్ని బీసీసీఐ త‌గ్గించిన సంగతి తెలిసిందే. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాల‌తో శ్రీశాంత్ మ‌ళ్లీ 2020లో క్రికెట్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: