42 రూపాయలు ఇవ్వండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దక్షిణాది భాషల్లో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత సామాజిక కార్యక్రమాలతోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అటు సినిమాలతో ఇటు సామాజిక కార్యక్రమాలతో నిరంతరం బిజీ బిజీ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో సామాజిక కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ముందుకువచ్చింది. ఆ కార్యక్రమమే ‘కావేరి కాలింగ్’. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవన్ జలసంరక్షణకు సంబంధించిన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో సమంత కూడా భాగమైంది. దీనిలో భాగంగా లక్ష మొక్కల్ని నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సమంత తన అభిమానుల సహకారం కోరారు. ”కావేరీ పిలుస్తోంది. మీరు స్పందిస్తారా.. http://samantha.cauverycalling.org వెబ్‌సైట్‌లో మీ విరాళాలు అందించండి. మీరు, నేను కలిస్తే.. లక్ష మొక్కల్ని నాటేందుకు సహకరించగలం” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతోపాటు ప్లకార్డు పట్టుకుని ఉన్న వీడియోను కూడా షేర్‌ చేశారు. ప్రతి మనిషి రూ.42 విరాళంగా ఇవ్వడం ద్వారా ఓ మొక్క నాటినవారవుతారని చెప్పారు. ప్రస్తుతం భూమిలో జలవనరులు అడుగంటుతున్నాయని..నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలోచించినప్పుడు తనకు దొరికిన సమాధానం కావేరీ కాలింగ్ అని చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటడానికి ముందుకు రండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: