RRR కి ప్రభాస్ స్వరం…ఎన్టీఆర్ లుక్ ఎప్పుడంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరెకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి న‌టిస్తున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో దీనిపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. దింతో తెలుగు ఇండ‌స్ట్రీనే కాకుండా.. మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ లుక్‌ను అక్టోబర్ 22న కొమరం భీమ్ పుట్టినరోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. చరిత్రలో జరిగిన రెండు పాత్రల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఆయన వాయిస్ ఓవర్‌తోనే ఈ సినిమాలోని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పరిచయం చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: