మంత్రిని తిట్టిన వ్యక్తి అరెస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరదలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ముఖ్యమంత్రి జగన్, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. వీడియోలో మంత్రిని దుర్భాషలాడిన శేఖర్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తితో పాటూ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంత్రిని దుర్భాషలాడుతూ వీడియో తీసింది ఎవరు.. స్క్రిప్ట్ రాసింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియో తీయించిన వ్యక్తులు గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని విజయవాడ సూర్యారావు పేట సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో అత్యంత గోప్యంగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ వీడియోలో మంత్రిపై దూషణలు చేసిన శేఖర్ ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున పలు యాడ్స్‌లో నటించినట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: