వైసీపీ రాజ్యసభ సభ్యుడు పార్టీలో ముఖ్య నేత విజయసాయి రెడ్డి తరచూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రతిపక్ష పార్టీ పై పార్టీ సభ్యుల పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఎప్పుడు చూసిన వారిపై నిప్పులు చెరగడం ఈయన వైఖరి. తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు. కోడెల చరిత్ర నీచమైనదని ఆయన ఎద్దేవా చేశారు. తన పార్టీ తనని కాపాడుతుందని పార్టీ పై తీవ్ర విమర్శలకి దిగారు.
స్పీకర్ గా పనిచేసిన వారిలో అత్యంత హీనమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరని గూగుల్ లో వెతికితే కోడెల, ఆయన దూడల పేర్లు ప్రత్యక్షమవుతున్నాయంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు రహస్యాలు మాజీ స్పీకర్ కోడెల గుప్పెట్లో ఉన్నాయని, అందుకే కోడెల ఎన్ని నేరాలకు పాల్పడినా చంద్రబాబు ఖండించడంలేదని తెలిపారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యుల గురించి రోజుకో కేసు తెరపైకి వస్తున్నా, పచ్చ పార్టీ వారిని కాపాడుతోందని ఆరోపించారు.