ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా..? జగన్ ని ప్రశ్నించిన లోకేష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసే విలేకరులపై దాడికి దిగడం అప్రజాస్వామ్య చర్య. సమాజంలో జరిగే మంచి పనులని అక్రమాలని ప్రభుత్వం దృష్టికి ప్రజానీకానికి చేరవేసేవాడే విలేఖరి. అలాంటి విలేఖరులపై దాడులకి దిగుతున్నారు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు.. తాము చేసే అక్రమాలని ప్రశ్నించినందుకు వారిని ఎదురించినందుకు.. తమ గుట్టును రట్టు చేసేస్తారేమో అనే భయంతో విలేఖరులపై దాడులకి దిగుతున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అయినప్పటికి వారీ చర్యలతో జనాన్ని భయంధోలనాకి గురి చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే అనంతపురం రాయదుర్గంలో చోటు చేసుకుంది. అక్కడి నేతలు చేస్తున్న కుట్రలని వెలికితీసి వాటిని ప్రశ్నించినందుకు మహా న్యూస్ కి సంబంధించిన విలేఖరి మనోహర్ పై దాడికి దిగారు అక్కడి వైసీపీ నేతలు. మనోహర్ కధనం ప్రకారం అనంతపురం రాయదుర్గంకి చందిన రామచంద్ర రెడ్డి అనే వైసీపీ నేత చేస్తున్న అక్రమాలని నిలదీస్తున్న మహా న్యూస్ విలేఖరి మనోహర ని గత కొంత కాలంగా రామ చంద్ర రెడ్డి అనుచరులు బెదిరింపులకి గురి చేస్తున్నారు.. ఈ తరుణంలో తాజాగా ఆయనపై దాదాపుగా 8 మంది రామచంద్రా రెడ్డి అనుచరులు రాళ్ళతో రాడ్ లతో దాడి చేశారు. ఈ దాడిని హత్యాయత్నపు చర్యగా పరిగణిస్తున్నాడు బాధితుడు.

ప్రస్తుతం దాడికి గురైన బాధితుడు మనోహర్ అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై జరిగిన దాడిని గురించి ఆయన మీడియా తో పంచుకున్నాడు. అక్కడి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీశాడు. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవటం బాధాకరం. ఒక విలేఖరి పరిస్తితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్తితి ఎలా ఉండబోతుందో తలుచుకుంటేనే భయానికి గురవ్వాల్సి వస్తుంది.

ఈ విషయం గురించి నిన్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించగా నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని గురించి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ని నిలదీశారు. లోకేష్ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా.. వై ఎస్ జగన్ గారు మీ ప్రభుత్వంలో దొంగ పేపర్, ఛానల్ తప్ప మరో మీడియా ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో మీ పార్టీరౌడీల దౌర్జన్యాలేంటి? అంటూ నిలదీశారు. విమర్శిస్తే ప్రాణాలు తీసేస్తారా? మీడియా వాళ్ళపై మీ పార్టీ నాయకులు ఇన్ని దాడులు చేస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా మీరు మౌనంగా ఉండటంలో అర్థమేంటి? అంటూ ఆయనని ప్రశ్నించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: