ఒకరి మీద ఒకరు అలిగారా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్రం ఆయన పట్ల అదే మక్కువ చుపిస్తుందా అంటే లేదు అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు..! గత దఫాలో కెసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు మోడీ ని చాల సార్లు కలిసారు అనే చెప్పాలి. ఇద్దరి మధ్యా సంబంధాలు బాగానే ఉన్నాయి కాని ఈ దఫా లో అల కనపడట్లేదు..! 2014-2019 కాలంలో కెసీఆర్ మోడీ అపాయింట్ మెంట్ కొరకు ఎప్పుడు వెళ్ళినా ఇట్టే దొరికిపోయేది కాని ఈసారి మాత్రం అలా కుదరడం లేదు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ నేతలు కూడ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇదే రకమైన వాతావరణం నెలకొంది. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీని కేసీఆర్ కలవనేలేదు. ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణం చేసే కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేదు.

తొలిసారి కేసీఆర్ తెలంగాన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో కేంద్రంతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పేవారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో తమ రాష్ట్రానికి రాజ్యాంగబద్దమైన సంబంధాలు ఉన్నాయని మాత్రమె చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోడీని పిలిచేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కానీ, ఆ సమయంలో మోడీ అపాయింట్ మెంట్ ఆయనకు దొరకలేదని సమాచారం. ఇవన్ని చూస్తుంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధం ఏ స్థాయిలో ఉందో మిరే ఆలోచించుకోవచ్చు..! ఇక రాజకీయంగా చూసుకుంటే ఒకరు మిద ఒకరు అలిగారు అనే చర్చలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: