ఇసుక సప్లై పెంచుతా..! అమల్లోకి రానున్న కొత్త విధానం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఎన్నో కొత్త పథకాలను విధానాలని అమలు లోకి తీసుకొస్తున్నాడు. ఈ తరహాలో జగన్ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త ఇసుక విధానం ప్రవేశాపెట్టనున్నాడు. సెప్టెంబరు 5వ తేదీ నుండి కొత్త పాలసీ అమలులోకి రానుంది. మార్కెట్లో ఇవాళ ఉన్న రేట్లు కన్నా, తక్కువ రేట్లకు ఇసుక అందుబాటులోకి రానుంది. ఇసుక సప్లై పెంచాలనేదే ఈ విధానం లక్ష్యంగా ఆయన భావిస్తున్నాడు.

ఇందుకు గాను మీక్ష నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఇసుక సప్లై పెంచాలని అధికారుల్ని ఆదేశించారు. లేకపోతే రేట్లు తగ్గవన్నారు. గుర్తించిన స్టాక్‌ యార్డుల్లో ఇప్పటినుంచే ఇసుక నింపడం మొదలుపెట్టాలని ఆయన ఆదేశించాడు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లను పెంచాలన్నారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అకవాశం వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. రవాణాలో కూడా ఇబ్బంది రాకుండా చూడాలని, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని కోరారు సీఎం. ఎవరూ తప్పులు చేయకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలియజేసారు.

ప్రజలకి మంచి చేయాలనే లక్ష్యంతో నేను ముందుకేలుతుంటే సహించలేని వాళ్ళు బాధ పడే వాళ్ళు చాల మంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన గుర్తుచేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: