తొలిసారిగా మోదీ ని సమర్ధిస్తున్న రాహుల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పుడూ ప్రధాని మోదీ చేసే పనులని ఆయన పథకాలను వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ కానీ తొలిసారిగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దిస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశాడు. ఒక్కసారిగా ఆయన మోదిని సమర్దిస్తూ ట్వీట్ చేయడంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేయడం పట్ల కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలిసారిగా మోదీని సమర్ధించారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవించాడు.

రాహుల్ ట్వీట్ చేస్తూ.. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘చాలా విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను నేను వ్యతిరేకించాను. కానీ ఈ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. కశ్మీర్‌ భారత అంతర్గత వ్యవహారం.. ఇందులో పాకిస్థాన్‌ లేదా మరే దేశమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జమ్మూ కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పాకిస్థాన్‌ మద్దతుతోనే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశం పాకిస్థాన్‌ అని తెలిసిందే కదా’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. ఇక ఆయన ఇలా ట్వీట్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.

Share.

Comments are closed.

%d bloggers like this: