నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతిల వివాహ వార్షికోత్సవం. వీరి పెళ్లి జరిగి నేటికీ సరిగ్గా 23 సంవత్సరాలు.. ఆగస్ట్ 28 1996 లో పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ మైదానంలో వీరి వివాహం జరిగింది. ఇక ఈ సంధర్భంగా వీరి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కారిస్తూ జగన్ సోదరి వైఎస్ షర్మిల వారికి సోహల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలియజేసింది.
షర్మిల ఈ విషయమై అన్నయ వదినలకి తన ఫేస్బుక్ ద్వారా స్పెషల్ విషెస్ తెలియజేసింది. వీరి పెళ్లి నాటి ఒక ఫోటోను పోస్టు చేస్తూ ‘అన్నయ్య,వదినమ్మలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని విష్ చేసింది. షర్మిల ఫేస్బుక్ పోస్ట్ తో జగన్ పెళ్లిరోజని తెలియడంతో వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షర్మిల షేర్ చేసిన ఫోటోను చూసి మురిసిపోతున్నారు. షర్మిల షేర్ చేసిన జగన్, భారతిల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.