‘సీబీఐ’ స్క్రీన్ పైకి..! మాజీ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గురజాల నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడనే ఆరోపణలతో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేనీ శ్రీనివాస్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు పై స్పందించిన హైకోర్ట్ సీఐడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అక్రమంగా మైనింగ్ చేశాడని తేల్చి చెప్పింది.

దీంతో అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణకు కూడ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా సమాచారం. ఈ నెల 26వ తేదీన ఈ కేసు పై సీబీఐ విచారణకి అనుమతిచ్చిన హైకోర్ట్ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఇక ఈ కేసు పై భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించేసినట్టుగా సమాచారం. హైకోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాత ఈ విషయమై ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకొంటారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. కేసు ప్రారంభం నాటి నుండి నియోజవర్గానికి యరపతినేనీ శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారని ఇక హైకోర్ట్ సీబీఐ విచారణకి అనుమతించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: