రైలు ధరలు తగ్గాయి..! వీటికి మాత్రమే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికులకి చార్జీలపై రాయతి ఇవ్వనున్నట్టు ప్రకటన జారీ చేసింది. బస్సు ధరలు విమానం ధరలు తగ్గినందుకు ఈ మేర నిర్ణయం తీసుకునట్టుగా అధికారులు వెల్లడించారు. అన్నీ ట్రైన్ టికెట్లపై కాదు సుమా..! కేవలం శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణం చేసే ప్రయాణికులకి మాత్రమే. కేవలం ఈ మూడు ట్రైన్ల చార్జీల పైనే రాయతి ఇవనున్నట్టు రైల్వే శాఖా వెల్లడించింది.

శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వేశాఖ ప్రయాణ ఛార్జీలో 25 శాతం రాయతి ఇవనున్నట్టుగా రైల్వే అధికారులు వెల్లడించారు. బస్సు ఫ్లైటు ఛార్జీలు తగ్గడంవల్ల ప్రయాణికులు ఈ ట్రైన్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడం లేదు అని తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. గత కొంత కాలంగా ఈ ట్రైన్లలో 50 శాతం కన్నా ఎక్కువ సీట్లు కాళిగా ఉండడం గమనించినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పై ఈ ట్రైన్లలో వెళ్ళే ప్రయాణికులకు 25 శాతం రాయతి ఉండబోతుంది అని స్పష్టమయ్యింది.

Share.

Comments are closed.

%d bloggers like this: