తల్లీ,కూతుళ్ల శవాలతో సెక్స్…నరరూప రాక్షసుడికి 4 జీవితఖైదులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వావి, వరసలు మర్చిపోయి మరీ రెచ్చిపోతున్నారు…చిన్న, పెద్ద తేడా లేకుండా అతి క్రూరంగా అత్యాచారాలకు ఒడికడుతున్నారు. ఆఖరికి శవాలను సైతం వదలట్లేదు కొందరు నరరూప రాక్షసులు. ఒక మహిళను, ఆమె ముగ్గురు కూతుళ్లను చంపి వారిపై అత్యాచారానికి పాల్పడిన సంచలన ఘటన ఒకటి మూడేళ్ల క్రితం తమిళనాడులో జరిగింది. ఈ కేసుకు గాను ఆ మానవ మృగానికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నాలుగు హత్యలకుగాను నాలుగు జీవితఖైదులతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ మహిళా కోర్టు జడ్జి మంజుల తీర్పు చెప్పారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…చిత్రవీణ అలియాస్ పాండిమ్మళ్(36) అనే మహిళ తన భర్త, ముగ్గురు కుమార్తెలతో కలిసి తమిళనాడులోని దిండిగుల్ జిల్లా పళనిలో నివాసముండేది. అయితే ఈ కుటుంబంపై చినరాజ్ అనే వ్యక్తి కన్ను పడింది. దీంతో చిత్రవీణను ఆకర్షించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న చినరాజ్ ఆమెను భర్త నుంచి విడదీసి చెన్నైలోని రాయపేటలో సహజీవనం చెయ్యడం మొదలుపెట్టాడు. చిత్రవీణతో పాటు ఆమె ముగ్గురు కూతుళ్లు పరిమళ్(19), పవిత్ర(18), స్నేహ(16) కూడా అతడి దగ్గరకి వచ్చేశారు. మొదట్లో కొద్దిరోజులు బాగానే ఉన్న చినరాజ్ ప్రియురాలి మూడో కుమార్తె స్నేహపై కన్నేశాడు. దీంతో ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేసేశాడు. ఈ క్రమంలోనే జూన్ 20, 2016 రోజున ప్రియురాలితో తీవ్రంగా గొడవ పడిన చినరాజ్ ఆమెతో పాటు ముగ్గురి కూతుళ్లను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు.

అనంతరం నాలుగు మృతదేహాలతోనూ సెక్స్ చేసి పైశాచికానందం పొందాడు. మూడు రోజులుగా ఇంట్లోని వారెవ్వరు బయటికి రాకపోవడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని లోనికి వెళ్లగా తల్లీకూతుళ్లు రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవులుగా కనిపించారు. ఆ షాక్ నుంచి తేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురు చనిపోయిన తర్వాత అత్యాచారానికి గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావడంతో పోలీసులు చినరాజ్‌ను అరెస్ట్ చేసి పక్కా ఆధారాలతో కోర్టులో హాజరు పరిచారు. దీనిపై మూడేళ్ల పాటు విచారణ కొనసాగించన న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. చినరాజ్‌ను దోషిగా నిర్ధారిస్తూ అతడికి నాలుగు జీవితఖైదులు విధించడంతో పాటు రూ.20వేల జరిమానా విధించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: