బీర్ల పై ఆర్టికల్ 370 స్టిక్కర్లు అంటించాడు..! వివాదామా..? భక్తా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మరిది వివాదామో, ప్రచారమో, దేశ భాక్తో..! కానీ దేవ్నాన్ని అనే వ్యక్తి మాత్రం ఓ వింత ప్రయోగం చేశాడు. ప్రధాని మోడీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు పై అనేక చర్చలు జరుగుతున్నాయి, కొందరు ఈ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.. అయితే ఈ నేపధ్యంలో ఫిలిప్పీన్స్ లో స్థిరపడ్డ మన దేశ వాసి ఉత్తర్ ప్రదేశ్ లక్నో నగరానికి చెందిన మైక్ దేవ్నాన్ని అనే వ్యక్తి మాత్రం వినూత్నంగా తన రెస్టారెంట్ లోని బీర్ సీసా లకి ఆర్టికల్ 370 35 ఏ అనే స్టిక్కర్లని అంటించాడు.

వింతగా ఉంది కదూ..! అవును మైక్ దేవ్నాన్ని తన రెస్టారెంట్ లోని బీర్ సీసాలకి ఆర్టికల్ 370 35 ఏ అనే స్టిక్కర్లని అంటించాడు. ఇక ఈ విషయమై ఆయనని అడిగిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ.. నేను వివాదానికో, ప్రచారానికో ఈ స్టిక్కర్లు అంటించలేదు.. నా దేశం పై నాకున్న ప్రేమతో అంటించాను అని సమాధానం ఇచ్చాడు. రెస్టారెంట్ కి వచ్చి బీర్ తాగే వ్యక్తులు ఈ స్టిక్కర్లు చూసి నన్ను వాటి గురించి అడుగుతున్నారు. అప్పుడు నేను మన దేశం గురించి మన దేశ ఔన్నత్యం గురించి వాళ్ళకి వివరిస్తున్నాను అని ఆయన సెలవిచ్చారు. తన రెస్టారెంట్ లో దేవ్నాని తన పాస్ పోర్ట్ ను గుర్తుగా గోడకి అంటించి పెట్టడం గమనార్హం.

Share.

Comments are closed.

%d bloggers like this: