తెలంగాణ ఎక్స్‌ప్రెస్ లో మంటలు..! పొగ వచ్చింది కాబట్టి సరిపోయింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ నుండి ఢిల్లీ వెళ్ళే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.. ముందుగా B1 బోగీలో రగిలిన మంటలు ఆపై S10 బోగీలోకి వ్యాపించాయి. మంటలు వచ్చినప్పటికి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరబాద్ నుండి ఢిల్లీ వెళ్ళే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు నేడు ఉదయం 7.43 గంటలకి అసౌటి-బల్లబ్‌ఘర్ సమీపంలో ఉండగా ఏ‌సీ బోగీలో(B1)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రగిలాయి ఆపై మంటలు పక్కనే ఉన్న S10 బోగీలోకి వ్యాపించాయి. పొగని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యి రాయ్లుని వెంటనే ఆపేశాడు.. రైలు ను నిలిపి వేసిన వెంటనే ప్రయాణికులు దిగిపోవడంతో సురక్షితులయ్యారు. ఈ విషయమై అధికారులకి ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడికి చేరుకొని ప్రయాణికుల సురక్షితను మంటలు వ్యాపించడంపై గల కారణాలను వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: