కేసీఆర్ కి ‘లులు’ తో లాలూచీ ఏంటీ..? కేంద్రం కన్ను కేసీఆర్ పై పడిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుత సచివాలయాన్ని లులు గ్రూప్స్ సంస్థకు కట్టబెట్టేందుకే వాస్తు దోషం పేరుతో రక్షణ శాఖ అధీనంలో ఉన్న బైసన్ పోల్ లో నూతన సచివాలయ నిర్మాణం చేయాలని కేసీఆర్ సంకల్పించారనేది బయట జరుగుతున్న చర్చ. లులు గ్రూప్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని మార్చే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? లేక ఇంకేదైనా డీల్ జరిగిందా అనే కోణాల్లో కేంద్ర ప్రభుత్వం విచారిస్తున్నట్టు తెలుస్తుంది. 2017లో కేరళలో జరిగిన లులు గ్రూప్స్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ కుమార్తె వివాహానికి సకుటుంబ సపరివార సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లారు, తనతోపాటు ప్రభుత్వంలోని మంత్రులను వెంటబెట్టుకొని వెళ్లడం అప్పట్లో చర్చంశనీయమైంది.

ఆ పెళ్లి సందర్భంలో ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చలో ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థలాన్ని లులు గ్రూప్స్ సంస్థ అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించేందుకు ఆ స్థలాన్ని అప్పగించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నట్టు, దానికి ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ఆ సంస్థ అధినేత ఆఫర్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ..!

సీఎం కేసీఆర్ కేరళ వెళ్ళినప్పుడు కుటుంబసభ్యులతో మంత్రులను వెంట తీసుకెళ్లడం కూడా వ్యూహంలో భాగంగా జరిగినట్టు సమాచారం, ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో బడా వ్యాపారవేత్త కూతురి పెళ్ళికి రెండు రోజుల టూర్ వెళ్తే అందరికి అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లినట్లు ఆ పెళ్ళికి వెళ్లిన ఓ మాజీ ఎంపీ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. గత ఐదేళ్ళలో కేటీఆర్, కవిత దుబాయ్ కి ఎన్నిసార్లు వెళ్లారు, ఎవరెవరిని కలిసారు అనే కోణాల్లో కేంద్రం విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మొన్న మైహోం అధినేత, మెగా గ్రూప్ ఇళ్లపై కార్యాలయాలపై ఐటి దాడులు జరిగిన నాటి నుండి కేసీఆర్ కుటుంబంలో భయాందోళనలు మొదలయ్యాయని ఇప్పుడు లులు గ్రూప్స్ వ్యవహారం బయటికి రాబోతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే డచ్ విల్లా భూములపై కూడా కేంద్రం ఫోకస్ చేసినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలన్ని గమనిస్తుంటే కేసీఆర్ కుటుంబం చుట్టు బలమైన ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తుంది..!

Share.

Comments are closed.

%d bloggers like this: