“కేజీఎఫ్ 2” కి ఊహించని దెబ్బ…నిలిపివేయాలన్న కోర్టు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన కేజీఎఫ్ దేశమంతటా సంచలన విజయం సాధించింది. అటు కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ 2 లో విలన్ పాత్ర లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు.. సంజయ్ దత్ వలన బాలీవుడ్ లో సైతం కేజీఎఫ్ 2 సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా, తాజాగా ఈ సినిమాకి కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతోందంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి స్థానిక కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు షూటింగ్ ని నిలిపివేయాలని సూచించింది. దీంతో షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త లొకేషన్ల కోసం వేట ప్రారంభించింది చిత్రయూనిట్.

Share.

Comments are closed.

%d bloggers like this: