తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక సప్లై పై కొత్త నిబంధనలు తీసుకొస్తామని సెప్టెంబర్ 5 నుండి కొత్త నిబంధనలు అమలు లోకి తీసుకొస్తామని తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఇక దీనికి గాను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు మరియు టీడీపీ వర్గాలు శుక్రవారం భారీ ఎత్తున నిరసనాలకి పాల్పడ్డారు. దాదాపుగా టీడీపీ ముఖ్య నేతలంతా గృహ నిర్బంధనలు నిరసనలు చేపట్టారు. ఈ నిర్ణయం వెనుక ఏదో లక్ష్యం ఉందని ఇదంతా కేవలం వైసీపీ నేతలని మేపడం కోసమని జగన్ తీసుకున్న నిర్ణయం అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ దానాన్ని వారి నేతలకి పంచడం కోసం వారి అక్రమాస్తులలో మరికొంత దానాన్ని నింపడం కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీడీపీ నేతలు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపాడేస్తున్నారు. ఇసుక కొరత ఉన్నట్టుగా సృష్టించడం కేవలం కల్పితమని ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేష్ భావించారు.
ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన ట్వీట్ చేస్తూ.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తన ప్రత్యేఖ ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ ఇసుకాసురులను మేపడం కోసం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని ఆయన పేర్కొన్నారు. పేదలను పీడించుకు తింటున్న ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో తమ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని ఆయన తెలియజేశారు. తమ ఉధ్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయని ఆయన తెలియజేశారు.
ప్రభుత్వం తమ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం తమ నాయకులని అరెస్టులు చేయించారని సొషల్ మీడియా ద్వారా తమపై దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ప్రభుత్వపు తీరు పై మండిపడ్డారు. జగన్ తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రంలో మూడు నెలలుగా పనులు లేక నిర్మాణా కార్మికులు తీవ్రంగా కష్టాల్లోకి మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే వాళ్ళు చాలా అప్పులు చేసేశారని అలా అప్పులు చేసిన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం 60 వేల రూపాయల ఆతిక సహాయం చేయాలని ఆయన సూచించారు. ‘ఇప్పటి వరకు తిన్నది చాలు.. ఇకనైనా పేదలను బతకనివ్వండి’ అని ఆయన తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.