మెగాస్టార్ చిరంజీవికి తృటిలో తప్పిన ప్రమాదం. ఆయన వస్తున్న విమానానికి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పైలట్ వెంటనే విమానాన్ని మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని విమానా అధికారులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.. ముంబై నుంచి హైదరబాద్ రావాల్సిన విమానం విస్తారా (యూకె 869) ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొంతసేపటికే విమానం లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి..! దీన్ని గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 120 ప్రయాణికులు ఉన్నారు అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తృటిలో తప్పింది. చిరంజీవి తీస్తున్న సాహో సినిమా ప్రమోషన్ పనులలో భాగంగా చిరు చాలా బిజీగా తిరుగుతున్నారు.. ఈ క్రమంలో ముంబై వెళ్ళి తిరిగొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిరు మరియు సహ ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.