వాళ్ళంతా వ్యభిచారులు..! చేతకాక నా పై పడుతున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.. ప్రభుత్వం కుప్పకూలడానికి కర్ణాటక మాజీ సీఎం సిద్ధారామయ్యే కారణం అంటూ కొంత కాలంగా జేడీఎస్ ప్రముఖులు ఆయన పై కొంత కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విషయమై ఆయనని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకి ఆయన వివాదాస్పదంగా జవాబిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకాలాన్ని రేపుతున్నాయి.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధారామయ్య తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు. కానీ ఈసారి మాత్రం ఆయన హద్దులు దాటేశారనే చెప్పాలి. ఆయన పై చేస్తున్న విమర్శలకి గాను ఆయనని ఆశ్రయించిన రేపోర్టర్ అడిగిన ప్రశ్నకి సిద్దారమయ్యా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జేడీఎస్ నేతలంతా వ్యభిచారులని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. జేడీఎస్‌ కార్యకర్తలంతా వ్యభిచారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘డాన్స్‌ రాని వ్యభిచారి.. వేదిక నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని చెప్తుంది. అలానే జేడీఎస్‌ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిద్ధరామయ్య మండి పడ్డారు. ప్రస్తుతం ఈ విషయం కర్నాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Share.

Comments are closed.

%d bloggers like this: