పవన్ సమావేశంలో పాము..హల్‌చల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మంగళగిరి జనసేన కార్యాలయంలో పాము హల్‌చల్ చేసింది. శనివారం మధ్యాహ్నం అమరావతి రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కొద్దిసేపటికి ఓ పాము అటుగా వచ్చింది. దీంతో షాక్ తిన్న పార్టీ కార్యకర్తలు, రైతులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై కొందరు పామును చంపేసి దూరంగా పడేశారు. దాంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధానిని తరలిస్తారని ప్రచారం జరగడంతో కొందరు రైతులు ఆయన్ను కలిశారు. దీంతో ఆయన రైతులకు అండగా అమరావతి ప్రాంతానికి వెళ్లారు. శుక్రవారం రాజధానిలో నిర్మాణాలను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం అమరావతి రైతులతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రైతుల సమస్యలపై పవన్ ఆరా తీశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: