ప్రజా నాయకుడి పదవ వర్ధంతి..! రాజన్నకి ఘన నివాళి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రజల మనిషి ప్రజల ముఖ్యమంత్రిగా పేరు గాంచిన ఒక గొప్ప నాయకుడు. పంచ కట్టుకి ఉట్టి పడే తేజస్సు కి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్..! ఆయనే పులివెందుల పులి బిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రుల కీర్తిని నలు ములలకి చాటిన మహా నాయకుడు. నేడే ఆయన వర్థంతి. కుల మతాలకి అతీతంగా ఆయన చేసిన సేవలకి ప్రజలపై ఆయన చూపిన మమకారానికి ఇప్పటికీ ఆయనని స్మరిస్తున్నారు. వైఎస్ పేరు వింటే చాలు పేదల ముఖాల్లో చిరునవ్వులు కనబడుతాయి. ఎవ్వరికీ ఎటువంటి కష్టం వచ్చినా వైఎస్ ఉన్నాడు అని భావించే ఆంధ్రులకి నేడు చాలా బాధకారమైన రోజు.

వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలని వెలుగు లోకి తెచ్చారు. మన రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎందరో ఈయన పథకాలకి అభిమానులు ఇప్పటికీ ఈయన పని తీరుని ఆదర్శంగా తీసుకుంటారు. కేజీ టూ పీజీ ఉచిత విధ్య ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ ఫీజు రియంబర్ మెంట్ వంటి పథకాలు వైఎస్ కి ఎంతగానో పేరుని తెచ్చి పెట్టాయి. ఈయన హయాంలో రైతులు చాలా సంతోషంగా ఉండే వాళ్ళు.. రాష్ట్రం అంతా వర్షాలతో సస్యశ్యామలంగా ఉండేది. రైతులకి వైఎస్ రాజన్న..! రాజన్న పథకాలు రైతులకి భరోసా లాంటివి. రైతన్నకి రాజన్న నిత్యం అందుభాటులో ఉండేవాడు.

పెదవాడు మంచి వైద్యం దొరకక బాధపడటం మరణించడం వైఎస్ ను ఎంతగానో కలచివేశాయి. ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదవాడికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించిన తొలి ముఖ్యమంత్రి. నేటికీ ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉందంటే అది ఎంత గొప్ప పథకమో మీరే నిశ్చయించుకోండి. పెద వాడి బిడ్డ పెద్ద చదువులు చదవాలని భావించాడు కేజీ తో పీజీ ఉచిత విద్యను మంజూరు చేశాడు. రైతు పంట సరిగా పండక తీసుకున్న రుణాలు కట్టలేక ఆత్మహత్యలకి పాల్పడటం సరికాదని రైతులకి ఋణ మాఫీ అందజేశాడు ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత మొట్ట మొదటి సంతకం తున మాఫీ పైనే పెట్టడం గమనార్హం.. ఇలా ఒకటి కాదు ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి..! అందుకే ఆయన అదిగమించి పదేళ్ళైనా.. నేటికీ ప్రజల హృదయాల్లో చెరగని గుర్తుగా ఆయన మిగిలి పోయారు..! ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనాకి ప్రత్యేక నివాళులు తెలియజేస్తుంది మహా న్యూస్.

Share.

Comments are closed.

%d bloggers like this: