రమ్మంది..! వెళ్ళాడు..! మైండ్ బ్లాక్ అయ్యింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అతనో కానిస్టేబుల్ తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆమెని కలిశాడు కలిసిన కొన్ని రోజులకే వారిద్దరూ దేగ్గరయ్యారు..! నెంబర్లు, మనసులు మార్చుకున్నారు. ఆమె ఆ కానిస్టేబుల్ ని రూమ్ కి రమ్మంది.. లాడ్జ్ బుక్ చేసింది. కానిస్టేబుల్ టెంప్ట్ అయ్యాడు.. అక్కడే పప్పులో కాలేశాడు..! రూమ్ కి వెళ్ళిన కానిస్టేబుల్ కి మైండ్ బ్లాక్ అయ్యింది…! అయోమయం లో పడ్డాడు ఆపై కాళ్ళ వెల్లా పడ్డాడు. అసలు ఏం జరిగుంటుంది..?

వివరాల్లోకి వెళితే… సుబ్బయ్య అనే కానిస్టేబుల్ తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడికి కొన్ని రోజుల క్రితం తన కుటుంబంతో వెళ్ళిన రంగమ్మ సుబ్బయ్య కి పరిచయం అయ్యింది. సుబ్బయ్య రంగమ్మ తరచూ కలుసుకునే వాళ్ళు. ఈ క్రమంలో ఇద్దరూ నంబర్లు మనసులు మార్చుకున్నారు. గంటలు తరబడి ఫోన్లో మాట్లాడుకునేవాళ్లూ. ఇలా ఉండగా రంగమ్మ సుబ్బయ్య ని కలవాల్సిందిగా కోరింది అది కూడా ఒంటరిగా ఎక్కడైనా ఓ రూమ్ లో. లాడ్జ్ కూడా బుక్ చేసింది.

దీనికి టెంప్ట్ అయిన సుబ్బయ్య ఫలానా లాడ్జ్ కి ఈ నెల 16 న వెళ్ళాడు. అక్కడ ఇద్దరూ కలుసుకున్నారు. ఉన్నట్టుండి ఎవరో డోరు గట్టిగట్టిగా బాదడంతో సుబ్బయ్య తలుపు తీశాడు. తలుపు తీయగానే సుబ్బయ్య షాక్ అయ్యాడు. తలుపు తీయగానే అనంతపురం కానిస్టేబుల్ శ్రీనివాసులు, మరో ఇద్దరు వ్యక్తులు కనిపీయడంతో సుబ్బయ్య కంగు తిన్నాడు. వారు ఇద్దరు ఉన్న ఫోటోలని శ్రీనివాసులు తీశాడు. సుబ్బయ్య వారిని ప్రాదేహించాడు.. కాళ్లా వేళ్లా పడ్డాడు ఎవ్వరూ వినడం లేదు.

ఈ విషయం బయటకి రావోద్దంటే 10 లక్షలు ఇవ్వాలంటూ లేకపోతే ఆ ఫోటోలని బయట పెడతానని శ్రీనివాసులు బెదిరించాడు. భయానికి గురైనా సుబ్బయ్య ముందు 5 లక్షలు ఆ తరువాత మరో 5 లక్షలు ఇస్తానని వారిని విన్నపించుకున్నాడు. ఇప్పటికే సుబ్బయ్యా వారికి 5 లక్షలు ఇచ్చేయగా మరో 5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీంతో తరచూ వారు వేదించడం బెధిరించడం మొదలు పెట్టారు. ఈ విషయమై సుబ్బయ్య పోలీసులని ఆశ్రయించాడు. వారిపై ఫిర్యాదు చేయగా వారు ముగ్గురూ ఒక్కటే వర్గం వారని ముగ్గురు కలిసి సుబ్బయ్యని ట్రాప్ చేసినట్టుగా స్పష్టమయ్యింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: