ఇంట్లో ఫ్రీడ్జ్ మాయం..పెద్దాయన మాయం..! వృద్ధురాలు అయోమయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆయన వయసు 92 తన భార్య కూడా వృద్ధురాలే..! చేదోడు వాదోడుకి ఎవ్వరూ లేరు.. పాపం పెద్దాయన ఎవరో ఒకరు తోడు ఉండాలి అని భావించి ఓ యువకుడిని పనిలోపెట్టుకున్నాడు. పని విషయం పక్కన పెడితే ఆ యువకుడు తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. మరి ఏం ఆశించాడో తెలియదు కానీ ఆ పెద్దాయనని కిడ్నాప్ చేశాడు. పెద్దాయన కనిపించట్లేదు.. పని మనిషి పరారయ్యాడు. వృద్ధురాలు అయోమయానికి గురయ్యింది.

వివరాల్లోకి వెళితే.. భారత రాజధాని ఢిల్లీ లోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఓ కిడ్నాప్ సంఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసింది కూడా 92 ఏళ్ళు నిండిన పెద్దాయనని. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో నివసించే కృష్ణ ఖోస్లా (92) ఓ రిటైర్డ్ ఉద్యోగి తన భార్య తో నివాసం ఉంటున్నాడు. తన వాళ్ళు దేగ్గర్లో ఎవ్వరూ లేకపోయేసరికి పెద్దాయన కిషన్ అనే ఓ యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. రోజు తమ ఇంట్లోనే భోజనం కూడా తినేవాడు కిషన్. మరి ఏం జరిగిందో ఎంతో కానీ కిషన్ తన వక్ర బుడ్డిని ప్రదర్శించాడు. కొందరు మనుషులని తీసుకొని ఓ మినీ లారీ లో తన యజమాని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వృద్ధులు ఇద్దరికీ మత్తు పదార్థం ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలికి మేలుకయ్యింది చూస్తే పెద్దాయన లేడు పని మనిషి కిషన్ కనిపించట్లేదు. ఆంధోళనకి గురయ్యిన వృద్ధురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా లో చూడగా కిషన్ ఆ పెద్దాయనని ఫ్రీజీ లో కుక్కి లారీ లో తరలిస్తునట్టు తేలింది. కిషన్ గురించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: