పోర్న్ స్టార్ ఫోటోని ట్వీట్ చేసిన పాక్ కమిషనర్..! ట్వీటు వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ పై నిప్పులు కక్కాలనే క్రమంలో పప్పులో కాలేస్తున్నారు పాకిస్తాన్ పెద్దలు. ఆ దేశానికి చెందిన మాజీ కమిషనర్ అబ్దుల్ బాసిత్ సైతం ఇలాంటి దుర్గతినే ఎదుర్కున్నారు. ఆయన చేసిన ట్వీటు నిమిషాల్లో వైరల్ అయ్యి భారీగా ట్రోల్ కి గురవ్వాల్సొచ్చింది. కాశ్మీర్ విషయం లో ఏ చిన్న లూప్ హోల్ దొరికిన దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూపాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళకే తిరిగి తగులుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారు ఎందుకు ట్రోల్ అవ్వాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా..?

ఆ దేశ మాజీ కమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీర్ లో జరిగిన రాళ్ళ దాడిలో ఓ యువకుడు కన్ను కోల్పోయాడు అంటూ ట్వీట్ చేశాడు. యువకుడు కన్ను కోల్పోవడం నిజమే అయినప్పటికీ ఆయన పొరపాటున యువకుడి ఫోటో బదులు అడల్ట్ చిత్రాలు పోర్న్ వీడియోస్ లో నటించే జానీ సిన్స్ ఫోటో పెట్టాడు ఇక అంతే.. ఆయన జానీ సిన్స్ ఫోటో పోస్ట్ చేయడంతో ఆ ట్వీటు కొంతసేపటికే వైరల్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఇక ఆయన చేసిన ట్వీటు ని స్క్రీన్ షాట్ తీసిన పాకిస్థాన్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ఆయన ట్వీటు ని రెట్వీట్ చేసి మీరు పోస్ట్ చేసిన ఫోటోలోని వ్యక్తి పోర్న్స్తార్ అంటూ ఆయనకి బదులు ఇచ్చింది. వెంటనే అలర్ట్ అయిన అబ్దుల్ ఆ ట్వీటు ని డిలీట్ చేశాడు. ఆయన డిలీట్ చేసినా వైరల్ అయ్యింది కాబట్టి ఆ పోస్టు సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతుంది. పాపం అబ్దుల్ బాసిత్ మాత్రం ఏదో చేయాలని పోయి ఏదో చేసి భారీగా ట్రోల్ అవుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: