పవన్ కళ్యాణ్…అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యాడు. సాధారణంగా ఏ హీరోకైనా, నాయకుడికైనా అభిమానులు ఉంటారు. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది విభిన్నం. ఎందుకంటే ఆయనకి భక్తులు ఉంటారు…దానికి కారణం అయన స్వభావం, అయన ఆలోచనా విధానం. అందుకే పవన్ కళ్యాణ్ పై ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే అయన ఫాన్స్ అంతలా మండిపడుతుంటారు. తాజాగా ఒక హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ గురించి పొరపాటున నోరుజారి అయన ఫాన్స్ కి బలైంది. ఆమె మరెవరో కాదు పవన్ కళ్యాణ్ తో పాటు పులి సినిమాలో నటించిన నికిషా పటేల్.
నిన్న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ నికిషా పటేల్ ‘హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్’కు బదులుగా ‘పావలా కల్యాణ్’ అంటూ పొరపాటున ట్వీట్ చేయడంతో ఈ రగడ మొదలైంది. అది తట్టుకోలేని పవన్ అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు..దీంతో తాను పొరపాటున ఆ హ్యాష్ ట్యాగ్ జతచేశాననీ, ఇప్పటికైనా పవన్ అభిమానులు ట్రోలింగ్ ఆపాలని నికిషా పటేల్ కోరింది. అయితే తాజాగా నికిషా పటేల్ కు మరో నటి పూనమ్ కౌర్ మద్దతుగా నిలిచింది. ఈరోజు పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నికిషా.. నువ్వు ప్రజలకు జవాబుదారీవి కావు. కాబట్టి వివరణలు ఇవ్వడం మానేయ్. లేదంటే నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. గతంలో నువ్వు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నీ వ్యాఖ్యలను వక్రీకరించిన ఆ చెత్త జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా. దానివల్ల నీ కెరీర్ పైనే ప్రభావం పడింది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయ్. నువ్వు నిజం కోసమే నిలబడతావ్. ఐ లవ్ యూ. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది.