ప్రభుత్వ ఉద్యోగులకి త్వరలో శుభవార్త చెప్పాలని చూస్తున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగ విరమణ వయో పరిమితి పెంపు పై ఆయన త్వరలో సమీక్ష చేయనున్నారు. ఉద్యోగుల రెటైర్మెంట్ ని 60 లేదా 61 ఏళ్లు పొడిగించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ విషయమై త్వరలో ఆయన ఒక నిర్ణయానికి రానున్నారు. మరి ప్రస్తుతం ఉన్న 58 సంవత్సరాలని రెండేళ్ళు కానీ మూడేళ్లు కానీ పెంచనున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఉద్యోగులకి రెటైర్మెంట్ పరిమితిని పెంచుతానని ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు.
మంగళవారం నాడు రాజేంద్రనగర్ లో గ్రామాల్లో 30 రోజుల్లో ప్రత్యేక కార్యాచాచరణ ప్రణాళిక అమలుపై నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఇచ్చిన హామీలు తప్పకుండా తీరుస్తామని ఆయన ప్రకటించారు. మండల, జిల్లా పరిషత్తు సమావేశాల్లో పాల్గొన్న ఉద్యోగులపై ఎవరైనా పరోక్షమైన మాటలు మాట్లాడితే ప్రభుత్వం సహించడాని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల అభివృద్దే ప్రభ్త్వ ముఖ్య లక్ష్యం అని ఆయన తెలియజేశారు.
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ ముఖ్యత చూపిందని అందుకు కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని ఆయన తెలియజేశారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రమోషన్ల కోసం వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు. ప్రమోషన్ లకి తగిన అర్హతలు ఉన్న వారిని ఒక లిస్ట్ చేసి లిస్ట్ లో ఉన్న వారందరికి తప్పనిసరిగా ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన అధికారులకి దిశా నిర్దేశం చేశారు. ఇక పోతే ప్రస్తుతం కలెక్టర్ల సర్వీస్ రికార్డును చీఫ్ సెక్రటరీ రాస్తే తాను సంతకం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. కలెక్టర్ల పనితీరు ఆధారంగా గ్రీన్ కలెక్టర్ అవార్డును ఇస్తామని ఆయన ప్రకటించారు.వికారాబబాద్ జిల్లాను చార్మినార్ జోన్ కలుపుతూ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ను ఆయన ఆదేశించారు.