హరీష్ రావు అభిమానుల మొక్కుబడి..! 1016 టెంకాయలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రం మాజీ మంత్రి హరీష్ రావు కి తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలో ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..! తాజాగా ఆయన అభిమానులు ఆయన పై ఉన్న అభిమానాన్ని తమదైన రీతిలో చూపించుకున్నారు. అలాంపుర జోగులంబ గుడిలో తమ మొక్కుబడిగా 1016 కొబ్బరికారాయలు కొట్టారు. తమ అభిమాన నాయకుడు హరీష్ రావు తెలంగాణ కి ముఖ్యమంత్రి అవ్వాలని వారు జోగులాంబ తల్లిని ప్రార్థించారు.

వివరాల్లోకి వెళితే.. తెలంగా రాష్ట్రం మాజీ మంత్రి హరీష్ రావు అభిమానులు రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు, వనపర్తి జిల్లా చందాపూర్‌‌కు చెందిన 25 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మంగళవారం అలాంపుర జోగులాంబ తల్లిని దర్శించుకున్నారు. తమ ప్రియతమా నాయకుడు హరీష్ రావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని వారు ఆ తల్లిని కోరుతూ 1016 కొబ్బరికాయలు కొట్టారు. మొక్కుబడి చల్లించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ.. హరీశ్ రావును తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేయాలని, లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ఉద్యమ కారుడు ఉద్యమంలో పాల్గొన్నాదౌ అలాంటి వ్యక్తిని పక్క పెట్టి వేరే పార్టీలనుండి వచ్చిన నేతలకి పదవులు కట్టబెడుతున్నారు అని వారు మండిపడ్డారు. టీ‌ఆర్‌ఎస్ పార్టీకి పడ్డ వొట్లన్నీ కేవలం హరీష్ రావుని చూసే పడ్డాయని ఆయన పనీ తీరు వల్లే మరోసారి ప్రభుత్వం లోకి వచ్చిందని వారు వ్యాఖ్యానించారు. కేసీఆర్ కళ్ళు తెరవాలని వారు సూచించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: