కన్నతల్లిని కొట్టి చంపిన కసాయి కొడుకు..! అంతటితో ఆగకుండా….

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్న తల్లినే కడతెర్చాడో కసాయి కొడుకు. మధ్యానికి బానిసై ఆ మత్తులో తన కన్నతల్లి పైనే దాడి చేశాడు..! చేతులు కాళ్ళు విరిచేసి ఆమె ప్రాణాలు తీసేశాడు. వెయ్యి రూపాయలకి గొడవ చేసి చివరికి ఆమెని తిరిగిరాని లోకాలకు పంపాడు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఐ కొత్త దేవేందర్ రెడ్డి ఈ ఘటన వివరాలని మీడియా ఎదుట బయట పెట్టాడు.

వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం తాళ్లపాడు గ్రామంలో గొర్రె సుశీల (50) తన కొడుకు వేణు తో నివాసం ఉంటుంది. భర్త గురుమూర్తి ఈమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త గురుమూర్తి కొడుకు వేణు వేదించడంతో మొదటి భార్యతో కరీంనగర్ కి వలస వెళ్లిపోయాడు. వేణు ఓ పచ్చి తాగుబోతు తిరుగుబోతు పక్కా జులాయి..! ఏ పని చేయడు. తల్లి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా మధ్యానికే కర్చుచేసేవాడు. ఇటీవలే తల్లి వేణు కి వెయ్యి రూపాయలు ఇచ్చి మందులు తీసుకు రమ్మని పంపించింది.తల్లి మందులకి ఇచ్చిన వెయ్యి రూపాయలు కూడా వేణు తన అలవాట్లకే కర్చు చేసేశాడు. మిత్రులతో కలిసి మధ్యం సేవించాడు.

తిరిగి ఇంటికొచ్చిన సమయంలో తల్లి వేణుని మందులు ఏవి అని ప్రశ్నించగా వేణు దురుసు సామదానాలు ఇచ్చాడు. మందులు లేవని ఇచ్చిన డబ్బులు మధ్యానికి కర్చుపెట్టానని సమాధానం చెప్పాడు. తనకి ఇంకా కూడా డబ్బులు కావాలని డబ్బులు ఇవ్వమని తల్లిని వేదించాడు. వేణు దురుసు సమాధానాలకి తల్లి సుశీల ఆగ్రహించింది. కోపం తో వేణు ని కొన్ని మాటలు అనేసి పడుకుంది.

మధ్యం మత్తులో ఉన్న వేణు తన తల్లి తనని తిట్టినందుకు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన తల్లి తనని తిట్టడం సహించలేని వేణు తన తల్లిని చంపేయాలని చూశాడు. తన తల్లి నిద్రించిన కొంత సేపటికి వేణు ఓ పెద్ద కర్రతో తన తల్లి తలపై గట్టిగా బాదాడు.. తల్లి బాధతో నొప్పితో విలపిస్తున్నప్పటికీ వేణు పట్టించుకోలేదు కనికరించలేదు. తన తల్లి కాళ్లని చేతులని విరిచేశాడు అంతటితో ఆగని వేణు మరోసారి తన తల్లి తల పై కర్ర తో బాదడంతో తన తల్లి అక్కడికక్కడే మరణించింది. తెల్లారేసరికి విషయం స్థానికులకి తెలియడంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకి సుశీల భర్త గురుమూర్తి కి తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వేణుని అదుపులోకి తీసుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: