టీడీపీ కి షాక్ వైసీపీ కి మరో కాంబో ప్యాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు ముగిశాయి…ఇప్పుడే అంతా ప్రశాంతంగా ఉంది..! కానీ ఇప్పటికీ కొందరు తెలుగు తమ్ముళ్ళు మాత్రం పార్టీ ని వీడాలని వేరే పార్టీల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకి ముందు టీడీపీ నేతలంతా వైసీపీ గూటికి వలసలు కట్టిన విషయం తెలిసిందే. ఆ వలసల ఎఫెక్ట్ టీడీపీ పార్టీ పై ఎంతగానో పడింది. ఇప్పటికీ నేతలు ఇలాగే పార్టీలు మారుతున్నారు. ఈక్రమంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ ని ఇచ్చాడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసి పాత్రుడు.

అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఏళ్లుగా పని చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో కూడా ఈయన పని చేశారు. అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసిపాత్రుడు కూడా అన్నయ్యతోనే పార్టీ లో ముప్పై ఏళ్లుగా పని చేస్తూ వచ్చారు. గత కొన్ని రోజులుగా సన్యాసిపాత్రుడు తన భార్య అనిత తో కలిసి పార్టీని విడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకి ప్రతీకాష్టగా ఆయన త్వరలో పార్టీ ని వీడబోతున్నారని స్పష్టం చేశారు. సన్యాసిపాత్రుడు తన భార్య అనితతో కలిసి త్వరలో పార్టీని వీడబోతున్నారు వైసీపీ లో చేరబోతున్నారు అని సమాచారం.. దీంతో తెలుగుదేశం పార్టీకి మరి షాక్ తగలబోతుందని రాజకీయ విశేల్శకులు భావిస్తున్నారు. కొంత కాలంగా తెదేపా సీనియర్ నేతలు పార్టీని వీడి పార్టీని కష్టతరం లోకి నెట్టేశారు ఈ జాబితాలో చేరానున్నారు సన్యాసిపాత్రుడు.

Share.

Comments are closed.

%d bloggers like this: