‘సింధు’గా సమంత..! వైరలా..? రియాలా..? అసలు ఎలా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఓ బేబీతో మానందరిని ఎంతగానో అలరించింది…! మజిలీ తో మన మనసులు దోచుకుంది..! యూటర్న్ తో వావ్ అనిపించుకుంది.. తానే మనందరి ఫేవరెట్ సమంతా అక్కినేని. అటు లేడి ఓరియంటెడ్ సినిమాలు ఇటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు రెండూ జానర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మానందరినీ ఎంతగానో అలరిస్తుంది ఈ భామ. ప్రస్తుతం స్పెయిన్ లో తన కుటుంబంతో హాలిడే ని ఎంజాయ్ చేస్తున్న సమంత మరో రెండు మూడు రోజుల్లో హైదరబాద్ కి రానుంది. హైదరబాద్ వచ్చిన తరువాత మళ్ళీ సినిమాల్లో నటించనుంది.

హైదరబాద్ వచ్చిన తరువాత సమంత తమిళ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సినిమా 96 తెలుగులో రీమేక్ లో నటించనుంది.. ఈ సినిమా లో శర్వానంద్ సరసన ఆమె కనిపించనుంది. ఇక పోతే సమంత తన ప్రేక్షకులకి మరో సర్ప్రైజ్ ఇవ్వనుంది. ప్రముఖ బ్యాడ్ మింటన్ స్టార్ పీవీ సింధు జీవితాన్ని ఆదారంగా తీస్తున్న బయోపిక్ లో ఆమె నటించనుంది అని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా ని ప్రముఖ విలన్ అందరికీ సుపరిచితుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాని ఆయన ఒక బాలీవుడ్ నటితో చేయాలి అని భావించాడు అందుకు గాను మంతనాలు కూడా చేశాడు కానీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో అది జరగలేకపోయింది. ఇక ఆయన దీనికి తగిన బెస్ట్ నటిలని ఆలోచిస్తున్న క్రమం లో ఆయనకి సమంతా తట్టిందట..! టాలీవుడ్ వర్గాల ప్రకారం ఇద్దరి మధ్య మంతనాలు జరగనప్పటికీ సోనూ సూద్ మాత్రం సమంత నే చేయాలి అని ఫిక్స్ అయిపోయాడట.. మరి దీనికి సమంత ఏమంటుందో..? వచ్చే ఏడాది సమంతా తల్లి అవ్వడానికి నిశ్చయించుకుంది అని అంటున్నారు..! మరి ఇలాంటి ఫుల్ టైమ్ స్పొర్ట్స్ ఫిల్మ్ లో ఆమె నటిస్తుందా..? సింధు సమంత కంటే చాలా హైట్ మరి ఆమెని సోనూ సూద్ ఎంధుకు ఎంచుకున్నాడు అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. మొత్తానికి ఈ విషయం పై సమంత కానీ సోనూ సూద్ కానీ ఎలాంటి స్ప్శ్తట ఇవ్వనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సమంత సింధు బయోపిక్ లో నటిస్తే బాగుంటుందని ఆష పడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: