ఆకలి ఎక్కువయ్యింది..! భార్యని చంపేశాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భోజనం పెట్టమన్నాడు.. కాస్త ఆలస్యం చేసింది అంతే..! ఆ తరువాత ఆ కీచకుడు ఏం చేశాడో కూడా ఊహించలేరు. సాధారణంగా భోజనం ఆలస్యమైతే ఎవరైనా కాస్త త్వరగా పెట్టమంటారు లేదా కొంత విసుక్కుంటారు. కానీ ఓ భర్త భోజనం పెట్టడం ఆలస్యమయ్యిందని తన భార్యని కిరాతకంగా చంపేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పొలంలో పూర్చిపెట్టాడు. ఏమి తెలియానట్టు నటిస్తూ పోలీసులకి కూడా ఫిర్యాదు చేశాడు. కానీ చట్టాన్ని మోసం చేయడం వీలు కాక దొరికిపోయాడు కటకటాల మధ్య గోడలు గీకుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ లో నివాసముంటున్న శ్రీ కృష్ణ తన భార్య పూనమ్ ని త్వరగా భోజనం పెట్టమన్నాడు. భోజనం తయారు చేసి పెట్టె క్రమంలో కొంత ఆలస్యం జరగడంతో. శ్రీకృష్ణ తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. కోపం తో ఊగిపోయాడు..! తన భార్య ఎంత చెప్పినా వినకుండా ఉద్వేగానికి గురయ్యాడు. పక్కనే ఉన్న ఓ పదునైన ఆయుధంతో ఆమె పై దాడి చేశాడు. బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఆమె మరణించడంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆమె మృతదేహాన్ని అక్కడనుండి తీసుకెళ్లి ఊరు చివర్లో ఉన్న పొలం లో పూర్చి పెట్టాడు. మర్నాడు తెల్లవారుజామున ఎవ్వరికీ అనుమానం కలిగించకుండా నటించడం ప్రారంభించాడు తన భార్య రాత్రి నుండి కనిపించడం లేదంటూ కట్టు కథ అల్లి అందరినీ నమ్మించాడు. తానే స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులకి తన నడవిడి పై అనుమానం రావడంతో తమదైన రీతిలో ఇంటరాగేట్ చేశారు దెబ్బకి నిజాన్ని బయటకి కక్కాడు. చివరికి కటకటాల నడుమ గోడలు గీకుతున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: