‘చలాన్’ ధర పేలింది..! కట్టలేక బైక్ ని తగలబెట్టాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త ట్రాఫిక్ నిబందనలు ఆంక్షలు అమలు లోకి వచ్చాయి. సరైన పత్రాలు లేకుండా ట్రాఫిక్ పోలీసులకి దొరికినా ట్రాఫిక్ నియమాలు ఉల్లంగిస్తూ దొరికినా ఇక అంతే సంగతులు. చలాన్లు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. చలాన్ ధరలు ఆకాశాన్ని అంటేశాయి..! ఉల్లంఘన చేసిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. చలాన్ రేట్లు పెరగడంతో జనాలు ఆంధోళనకి గురవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొందరు వాళ్ళ వాహనాలని వదిలేసుకుంటున్నారు.. మరి కొందరు మేము చలాన్ కట్టలేము బాబో.. మమ్మల్ని జైలుకి పంపండి అని వేడుకుంటున్నారు. కానీ నిన్న మాత్రం ఓ యువకుడు చాలన్ కట్టలేక తన సొంత వాహనానికే నిప్పంటించాడు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని షేక్ సరాయి ఫేజ్-1లో గురువారం రాత్రి రాకేశ్ అనే వ్యక్తి మధ్యం తాగి పోలీసులకి దొరికాడు. ఒకటి తాను మధ్యం తాగి వాహనాన్ని నడుపుతున్నాడు మరొకటి తన వద్ద సరైన పత్రాలు ఏవి లేవు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ శాతం 200 పాయింట్లు దాటింది. దీంతో తనకి విదించాల్సిన చాలన్ ధర తారా స్థాయికి చేరుకుంది. చాలన్ ధర చూసిన ఆ వ్యక్తికి మధ్యంతో ఎక్కిన మత్తంతా దిగిపోయి ఒక్కసారిగా కళ్ళు జిగేలు మన్నాయి. పైగా చాలన్ కట్టలేని పరిస్థితి..! ఇక దిక్కు తోచని స్థితిలో రాకేశ్ పోలీసులని తనకి అవసరమైన పత్రాలు బండి లో ఉన్నాయని ఒక్కసారి కీస్ ఇవ్వమని అడిగి బండి వద్దకి వెళ్ళి పెట్రోల్ పైప్ పికెశాడు. పెట్రోల్ లీక్ అవుతున్నప్పుడు అందులో నిప్పెశాడు.

దీన్ని గమనించిన పోలీసులు అప్రమత్తమై బండికి అంటిన నిప్పునీ ఆపేసి పరిస్థితి ని చేతుల్లోకి తెచ్చుకున్నారు. తన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ట్రాఫిక్ చాలాన్ ధరలు పెరిగినప్పటినుండి ఇలా ఎన్నో కేసులు మన కళ్ళముందుకి వచ్చాయి. ఓ వ్యక్తి బండి ధర 15 వేలు తనకి విదించిన చలాన్ ధర 23 వేలు. ట్రాక్టర్ డ్రైవర్ కి 54 వేలు.. ఆటో డ్రైవర్ కి 37 వేలు ఇలా చలాన్ ధరలతో అధికారులు జానాన్ని అయోమయం లోకి నెట్టేస్తున్నారు. పొట్ట గడవడమే కష్టంగా కొందరు జీవిస్తుంటే అధికారులు ఇంత మొత్తంలో చలాన్ లు విదిస్తుంటే వారు నిస్సహాయులు అవుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వాలు కోర్టులు తమ గురించి ఆలోచించాలని వారి కోరుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: