‘మా పార్టీలోకొస్తే ఆ పదవి గ్యారంటీ’..! బాబుకి షాక్ ఇవ్వనున్న తోటా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని అధినేత చంద్రబాబు పర్యటనలు చేస్తుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం సమావేశాలకి డుమ్మాలు కొడుతూ.. పార్టీని వీడుతూ.. కొందరు వీడుతామంటూ ఇలా రోజుకి ఒకరు చొప్పున అధినేత బాబుకి షాక్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా చేరిపోయారు గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీ అధినేత జగన్ తో సన్నాహాలు చేస్తున్నారు అనే చర్చలు కూడా జరగకపోలేదు. పార్టీ కి దూరంగా ఉండటమే కాకుండా చంద్రబాబు సమావేశానికి సైతం త్రిమూర్తులు డుమ్మా కొట్టాడు. దీంతో దాదాపుగా ఆయన పార్టీ మారుతున్నాడు రేపో మాపో వైసీపీ లో చేరుతాడేమో అనే పరిస్థితి.

ఇక బాబు సమావేశానికి డుమ్మా కొట్టడంతో తూర్పు గోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ వీడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తోటా ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తో మంతనాలు జరిపారని పార్టీలో చేరితే ఏ పదవి ఇస్తారు అనే విషయం పై కూడా ఆయన క్లారిటీ తెచ్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాపు నాయకుల్లో ఒకరిగా తోటా త్రిమూర్తులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దీంతో జగన్ కు కూడా ఆయనపై మంచి ఒపీనియన్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వైసీపీ లో చేరితే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవి ఇస్తామని జగన్ ఆయనకి హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం జగన్ నుంచి హామీ ఉండటం వల్లే ఆయన చంద్రబాబు సమావేశానికి కూడా వెళ్లడానికి నిరాకరించారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జగన్ కీలకమైన కాపు నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: