కొత్త కథ..! కొత్త దర్శకులు..! కొత్త ఆలోచనలు..! 2 అవర్స్ లవ్ మూవీ రివ్యూ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొత్తతరం దర్శకులు కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే కొత్త హీరోలను, దర్శకులను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా తానే హీరోగా మారి తన స్వీయ దర్శకత్వంలో శ్రీపవార్ తెరకెక్కించిన సినిమా 2 అవర్స్ లవ్. హీరో, దర్శకడిగా తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా? సినిమా ఎలా ఉంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెల్లాల్సిందే.

కథ : అధయ్ (శ్రీపవర్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఒక కాఫీ షాప్‌లో పనిచేసే నయన (క్రితి గర్గ్)తో ప్రేమలో పడతాడు. నయన ఒప్పుకుంటుంది కానీ కొన్ని షరతులు పెడుతుంది. నేను కేవలం సాయంత్రం 4-6 మాత్రమే నిన్ను ప్రేమిస్తాను అని చెబుతుంది. నయనని గాఢంగా ప్రేమించిన అధయ్ వేరే దారి లేక తన షరతులకు ఒప్పుకుని అగ్రీమెంట్ మీద సంతకం చేస్తాడు.

మరో వైపు విలన్ గ్యాంగ్ నయనతో ఉన్న పాత గొడవల కారణంగా తనపై ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం తెలిసిన అధయ్ నయనను రక్షించడానికి ఏం చేశాడు? విలన్స్ నుంచి అధయ్ నయనను ఎలా కాపాడాడు? అసలు అధయ్, నయన పెట్టుకున్న షరతులు ఏంటి, వాళ్ళిద్దరి గతం ఏమిటి? రెండో భాగంలో వాళ్లిద్దరికీ ఏమైంది? వాళ్ళు పెళ్ళిచేసుకున్నారా లేదా? వారికి, విలన్ కి మధ్య ఉన్న విభేధాలు తొలగాయా లేదా? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
పాజిటివ్ పాయింట్స్ : కథ, కథనం, ఒక కొత్త రకమైన ప్రేమకథ. అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో ఉన్న మలుపు సినిమాకి ఎంతో ఉపయోగపడి థ్రిల్‌కు గురిచేస్తుంది.

మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా కథ కొంచెం స్లోగా సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం హాస్యం జోడిస్తే బాగుండేది.
ఓవరాల్‌గా చెప్పాలంటే 2అవర్స్ లవ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ మెప్పించ ఓ కొత్త రకమైన లవ్ స్టోరీ.

చివరిగా: 2 హావర్స్ లవ్ యూత్ ను ఆకట్టుకునే ఆసక్తికరమైన ఫీల్ గుడ్ మూవీ.

రేటింగ్: 3.5/5

చిత్రం : 2 అవర్స్ లవ్

తారాగణం : శ్రీపవార్, క్రితి గర్గ్, తనికెళ్ళభరణి, వర్ధన్, నర్సింగ్ యాదవ్ తదితరులు
సంగీతం : గ్యాని సింగ్
నిర్మాణ సంస్థ : శ్రీనిక క్రియేటివ్ వర్క్స్
దర్వకత్వం : శ్రీ పవార్.

Share.

Comments are closed.

%d bloggers like this: