అసలు చంద్రయాన్ 2 జాబిల్లి మీద ల్యాండ్ అయ్యిందా లేదా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నూటాముప్పై కోట్ల మంది ఆశలని తన భుజాల పై వేసుకొని జులై 22న నింగికెగిరింది చంద్రయాన్ 2. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమించి తమ మేదా సంపత్తుని తమ ప్రతిభని తమ అనుభవాన్ని పోర్తిగా దారపోసి ప్రయోగాన్ని చేపట్టారు. భారత దేశానికే ఎంతో ప్రతిష్ట తీసుకొచ్చిన చంద్రయాన్ 2 చంద్రుడి పై అధ్యాయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రయోగించిన అస్త్రం..! వీరు ప్రయోగించిన అస్త్రం విక్రమ్ ల్యాండర్ దాదాపుగా శాస్త్రవేత్తలు అనుకున్న రీతిలో చంద్రుడి ఉపరితలం వైపుగా దూసుకెళ్లింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిమీ దూరం వరకు వెళ్లింది. మరికొంత సేపట్లో చంద్రుడి ఉపరితాలానికి చేరాల్సిన విక్రమ్ ల్యాండర్ అందరినీ ఉత్కంతకి గురిచేసింది. ఇస్రో డైరెక్టర్ కే శివన్ ప్రధాని మోడీలు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కొన్ని అనుకోని కారణాల వల్లా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సిగ్నల్ బ్రేక్ అయ్యింది. దీంతో అసలు ల్యాండర్ సక్రమంగా అయ్యిండా లేదా అనే విషయం శాస్త్రవేత్తలకి కూడా అర్థం కానీ పరిస్థితి.

ఇలా అవ్వడంతో శాస్త్రవేత్తలు కొంతపాటి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇస్రో డైరెక్టర్ కే శివన్ లోపాలకు గల కారణాలను త్వరలో విశ్లేషిస్తామని అందుకుగల కారణాలని వెల్లడిస్తామని ఆయన తెలిపారు.. మరోవైపు, చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ దిగే ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో విజయం అందుకుంటారనే నమ్మకం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలోని ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, మీరు సాధించింది తక్కువేం కాదని.. అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో ఆశావాద దృక్పథంతో సాగుదామని, దేశం యావత్తు మీ వెనుక ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: