ప్రభుత్వం తమదనని అహంకారంతో కొందరు నేతలు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.. నాయకత్వం లోకి వస్తే ఎలాగో చుక్కలు చూపిస్తారని ప్రజలు ముందుగానే భావించారు. అందుకు ప్రతీకాష్టగా ప్రజల అంచనాలకి నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. వారు అనుకున్న రీతిలోనే ఆ నేతల చర్యలకి పాల్పడుతున్నారు.. అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకో ఘటన..! రోజుకో దాడి..! ప్రశ్నించే గొంతును అసెంబ్లీ లో అనిచేస్తున్నారు. అల్సెంబ్లీ లో నేతల పై పద దూషణ..! ఇక ప్రజల్లోకి తమ వార్తలని తీసుకెళుతున్నందుకు జర్నలిస్ట్ లపై దాడుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మరి ఈ దాడులు ఏ రాజకీయ పార్టీ చేస్తుందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో టీడీపీ నాయకుల ఇళ్లు, షాపులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ నేతల ఇళ్ల వైపు వెళ్తూ… మందు బాటిళ్లను ఆ ఇళ్లపైకి విసిరేశారు. దగ్గర్లోని షాపుల అద్దాల్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు పెద్ద గాయాలయ్యాయి. ఇలాగైతే తాము బతకలేమనీ… తమను చంపేస్తున్నారనీ… బాధితులు లబోదిబో మంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు… అక్కడ అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఈ దాడులకి స్పందించిన మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ దీటుగా స్పందించారు..! బాధితులనీ నేరుగా కలిసిన ఆయన వారిని ఆప్యాయంగా పలకరించారు.. వారికి తాను ఉన్నానని మద్దత్తుని తెలియజేశాడు. ఇదే క్రమంలో జగన్ పై ఆయన పాలన పై విమర్శలు చేశాడు. ఇది రాజన్న పాలన కాదని.. రాక్షస పాలన అని ఆయన విమర్శించారు. తప్పులు చేయని వారిపై అక్రమ కేసులు పెట్టి జగన్ ఇబ్బందులు పెడుతున్నాడని.. ఆ అక్రమ కేసులు తమ నేతలపై పెట్టసిన కేసులని ఆయన గుర్తు చేశారు. టీడీపీ పార్టీ ని పార్టీ నేతలనీ కార్యకర్తలనే జగన్ టార్గెట్ చేశాడని ఆయన తెలియజేశాడు. ఎవ్వరికీ బయపడేది లేదని ఇప్పటికే వంద రోజులు ఉపేక్షించామని ఇక పై ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. దాడులు చేయడం అనైతిక చర్యని ఆయన మండిపడ్డారు. బాధితులకి ఒక్కకరికీ పది వేల రూపాయలు చొప్పున సాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.