7 ఏళ్ళు కూడా నిండని చిన్నారి..! 16 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ఆడది’ అనే పదంలో ఆ అంటే అమ్మతనం ఆని అర్థం..! కానీ కొందరు కామాంధులు ఆ అర్థాన్నే వ్యర్థం చేస్తున్నారు. ఆడది కనిపిస్తే చాలు అత్యాచారాలు చేస్తున్నారు. మదమెక్కిన ఈ కామాంధులు మతిస్థిమించి చిన్న-పెద్ద, ముసలి-మధ్య, బంధం-బాధ్యత అనే తేడాలు కూడా చూడకుండా వారి కంటికి ఎవ్వరూ కనిపిస్తే వారి పై అత్యాచారాలు చేసి తమ కామావాంచని తీర్చుకుంటున్నారు. మైనర్ బాలుల నుండి వృద్ధుల వరకు అందరూ అత్యాచారాలకి పాల్పడుతున్నారు. ఇదే తరహాలో ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు ఏడేళ్ళ చిన్నారి పై అత్యాచారం చేశాడు. చట్టంలో మార్పులు చేసి కటినంగా శిక్షిస్తే తప్ప ఈ చర్యలకి సమాప్తం పలుకలేదు సమాజం మారాదు.

వివరాల్లోకి వెళితే..విశాఖపట్టణం పరిధిలోని ప్రహ్లాదపురంలో ఓ 16 ఏళ్ల బాలుడు ఏదేళ్లు కూడా నిండని ఓ చిన్నారి పై అత్యాచారం చేశాడు. పక్కింట్లో నివసించే ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ నెల నాలుగో తేదీన ట్యూషన్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఆచూకీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పక్కింట్లో వెతికారు.

ఆ సమయంలో బాలుడు, బాలిక ఇద్దరే అక్కడ ఉన్నారు. చిన్నారి రక్తస్రావానికి గురవ్వడం గమనించిన తల్లిదండ్రులు ఆ బాలుడు అత్యాచారం చేసినట్టుగా గుర్తించారు. వెంటనే ఆ బాలుడుని అదుపులోకి తీసుకొని పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: