మలింగ మ్యాజిక్…! నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు..! కుప్పకూలిన కివీస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీలంక దిగ్గజం లాసిత్ మలింగ తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు.. వరుసగా నాలుగు బంతులకి నాలుగు వికెట్లు తీశాడు మరో రెండు బంతులకి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మేడిన్ నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో ఇలా కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిగింది.. దీంతో మలింగ ఇలా ఐదో సారి చేసి చరిత్ర తిరగరాశాడు.. తన సత్తా చాటాడు.. అంటే కాకుండా మ్యాచ్ విజేత్యాగా నిలిచాడు. మలింగ బౌలింగ్ కి న్యూజిలాండ్ ఆటగాళ్లు గ్రీజులో నిలవలేకపోయారు.. భయపడిపోయారు..! తన ప్రదర్శనతో శబాష్ మలింగ అనిపించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో పల్లెకలె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మలింగ తన జట్టుకి విజయాన్ని అందించాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికాపై ఇలానే మలింగ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గానూ మలింగ నిలిచాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకా బ్యాటింగ్ లో పెద్ద స్కోర్ చేయలేకపోయింది.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఏ ఒక్క బ్యాట్ మెన్ కూడా 30 మించి పరుగులు చేయకపోగా మ్యాచ్ లో ప్రేజర్ కి గురయ్యింది శ్రీలంక.

బ్యాట్స్ మెన్ లు ఎవ్వారూ సరైన ప్రదర్శన చేయకపోడంతో మ్యాచ్ బాధ్యత అంతా బౌలర్ల పై పడింది. మ్యాచ్ విజయాన్నే కీలకంగా భావించి గెలుపుని లక్ష్యంగా ఎంచుకున్న మలింగ తన ప్రదర్శనతో అందరి మతి పొగట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ మూడో బంతికి కొలిన్ మున్రో (12)ని బోల్తా కొట్టించిన మలింగ.. ఆ తర్వాత బంతుల్లో వరుసగా హమీశ్ రూథర్‌ఫర్డ్(0), కొలిన్ గ్రాండ్‌హోమ్(0), రాస్‌టేలర్ (0)లను పెవిలియన్ బాట పట్టించేశాడు.. టాప్ ఆదర్ ని కుప్పకూల్చిన మలింగ మ్యాచ్ ని విజయం చేరువలోకి తీసుకెళ్ళాడు. మాళింగ తాకిడికి గురైన న్యూజిలాండ్ 16 ఓవర్లలో కేవలం 88 మాత్రమే చేయగలిగింది. చరిత్ర సృష్టించినందుకు గాను మ్యాచ్ కి విజయాన్ని అందించినందుకు గాను మలింగ్ కి ఉత్తమ ప్రదర్శన అవార్డుని ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: