రెండుగా చీలిన సమాచారశాఖ అధికారులు-సిబ్బంది

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సమాచార శాఖ కమిషనర్ పై భారీ అవినీతి ఆరోపణలు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పై చర్యలు తీసుకోవడానికి సిధ్దమైనట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా కమిషనర్ పై ఆరోపణల నేపధ్యంలో ఆ శాఖలో గ్రూప్ తగాదాలు మొదలయ్యాయి. దీంతో సమాచారశాఖ సిబ్బంది అంతర్గతంగా రెండుగా చీలిపోయారు. ప్రభుత్వం ఎవరి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అర్ధంకాక సిబ్బంది తలపట్టుకున్నారు. మరోవైపు సమాచారశాఖ పై అవినీతి ఆరోపణల వస్తున్న నేపధ్యంలో ఆ శాఖ పై సెక్రటరీ రామాంజనేయులు పట్టుబిగించుకుంటున్నారు. గతంలో ఈ ఉన్నతాధికారి రామాంజనేయులకు కమిషనర్ కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇప్పుడు రామాంజనేయుల వర్గీయిలు ఆ శాఖపై పట్టుబిగించుకుంటున్నారు. తాము ఎస్సీ సామాజికవర్గం కావటంతోనే సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ సామాజికవర్గ సిబ్బంది, అధికారులు వాపోతున్నారు అంతేకాక అవినీతి ఆరోపణలతో సిఎంవో కు చెడ్డపేరు తెచ్చిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. గత మూడు రోజులగా ఈ కమిషనర్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు సతీశ్ చంద్ర, రామాంజనేయులు, మంత్రి కాల్వ, కృష్ణయ్య లు ఆయన పై చర్యలకు సిద్ధమైయ్యారు.అయితే ఈ అవినీతి కమిషనర్ ను కాపాడేందుకు ఈ ప్రభుత్వంలోనే ఓ కీలక అధికారి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కమిషనర్ కోసం లాబీయింగ్ కు దిగిన బినామీ ఏజెన్సీ నిర్వహకులని తెలుస్తుంది. మరోవైపు ఇంత గందరగోళానికి తెరదీసిన కమిషనర్ వెంకటేశ్వర్ చాంబరే సిఎంవో లో తమ కొంపముంచిందని సిఎంవో వర్గాలు అంటున్నాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: